తెలంగాణలో కరోనా గడిచిన 24 గంటల వ్యవధిలో 88,867 టెస్టులు నిర్వహించగా 3801 పాజిటివ్‌ కేసులు…

R9TELUGUNEWS.COM తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 88,867 టెస్టులు నిర్వహించగా 3801 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. అలాగే, కొవిడ్‌ బాధితుల్లో 2046 మంది కోలుకోగా.. ఒకరు మృతిచెందారు. తాజా కేసులతో రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 38,023కి పెరిగింది. మరోవైపు, జీహెచ్‌ఎంసీలో భారీగా కొవిడ్‌ కేసులు వచ్చాయి. బుధవారం ఒక్కరోజే 1570 కేసులు బయటపడ్డాయి. అలాగే, రంగారెడ్డి జిల్లాలో 284 మందికి వైరస్‌ సోకగా.. మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో 254, హనుమకొండ 147, ఖమ్మం 139 సిద్ధిపేట 96,మహబూబ్‌నగర్‌ జిల్లాలో 86 చొప్పున అత్యధికంగా కొత్త కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తంగా 3.16 కోట్ల పరీక్షలు నిర్వహించగా.. 7,47,155 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 7,05,054 మంది కోలుకోగా.. 4078మంది మృతిచెందారు. ప్రస్తుతం 38వేలకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మరోవైపు, నిన్నటితో పోలిస్తే టెస్టులు, కేసులు తగ్గాయి. నిన్న 1.13లక్షల శాంపిల్స్‌ టెస్ట్‌ చేస్తే 4559 మందికి పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే.