తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 68,720 శాంపిల్స్‌ను పరీక్షించగా..కొత్తగా 1,380 పాజిటివ్‌ కేసులు ..

R9TELUGUNEWS.COM: తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 68,720 శాంపిల్స్‌ను పరీక్షించగా.. కొత్తగా 1,380 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 3,877 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24వేల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 96.39 శాతంగా ఉంది.