తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కొవిడ్‌ కేసులు…

తెలంగాణలో కొవిడ్‌ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. రాష్ట్రంలో గురువారం 28,865 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, కొత్తగా 494 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇందులో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 315 కేసులు నమోదు కావడం గమనార్హం. కొవిడ్‌ బారి నుంచి ఇవాళ 126 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,048 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది.కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్‌ పరిస్థితులపై కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌మాండవీయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాజిటివిటీ రేటు ఎక్కువున్న జిల్లాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. కొవిడ్‌ వైరస్‌ మ్యుటేషన్లను నిశితంగా పరిశీలించాలని సూచించారు. హోల్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయాలని, ఆర్టీపీసీఆర్‌ టెస్టులను పెంచాలని అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారు…