తెలంగాణలో కరోనా పై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్. కీలక వ్యాఖ్యలు….

తెలంగాణలో కరోనా కేసుల పెరుగుదల 4-6 వారాలకు వరకు ఉంటుందన్నారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 0.07 నుంచి 1 శాతానికి చేరుకుందని వెల్లడించారు. దేశంలో కరోనా నాల్గోవేవ్ వచ్చే అవకాశం తక్కువ అని తెలిపారు. విద్యా సంస్థలు వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. ముందస్తు జాగ్రత్తగా అందరూ మాస్క్‌లు ధరించాలన్నారు శ్రీనివాస్. వచ్చేది వర్షాకాలం..
ఆ కాలంలో రోగాలు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని డీహెచ్ తెలిపారు. వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 12 నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్‌ అందుబాటులో ఉందన్న డీహెచ్.. దాదాపు 90శాతం మేర వారికి టీకా ఇచ్చామన్నారు. తల్లిదండ్రులు పిల్లలందరికీ టీకాలు వేయించేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు…