తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంటి పోరుపై రాహుల్ గాంధీ దృష్టి..!!..!

తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న ఇంటి పోరుపై రాహుల్ గాంధీ ఫోకస్ పెట్టారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం, ఆరోపణలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ పటిష్టత కోసం సునీల్ టీంను హైదరాబాద్‌కు పంపారు. ..టీపీసీసీ చీఫ్ గా రేవంత్ కు బాధ్యతలు అప్పగించిన తరువాత..పార్టీలో జరుగుతున్న పరిణామాల పైన హైకమాండ్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. తాజాగా , తెలంగాణ కాంగ్రెస్ లో ఇంటి పోరు పెరగటంతో..ముఖ్య నేతలను ఢిల్లీ పిలిపించి వారికి పార్టీ నేత రాహుల్ దిశా నిర్దేశం చేసారు.

కాంగ్రెస్ క్యాడర్ లో జోష్ నింపేందుకు నిత్యం తెలంగాణాలో రాహుల్ పర్యటన..

తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లో ఇప్పటికీ ఆదరణ ఉందని నమ్ముతున్న కాంగ్రెస్ నేతలు..ఐక్యంగా ముందుకు సాగితే అధికారం దక్కుతుందని అంచనాల్లో ఉన్నారు. దీంతో..పార్టీ నేతలకు రాహుల్ కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. దీంతో..పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణికం ఠాకూర్ హైదరాబాద్ లో వరసగా మీటింగు లతో బిజీగా గడుపుతున్నారు… రాహుల్ పర్యటనతో పాటుగా.. సంస్థాగతంగా పార్టీ సభ్యత్వం… సభ నిర్వహణ పైన చర్చించి.. దిశా నిర్దేశం చేయనున్నారు. దీంతో..రాహుల్ పర్యటనతో పార్టీలో జోష్ పెరుగుతుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

సమన్వయం చేయడానికి కి ఒక అభిప్రాయ సేకరణ సునీల్ టీం..

పీసీసీ సీనియర్ సమావేశానికి వచ్చింది సునీల్ టీమ్. సమావేశంలో మాట్లాడిన నాయకుల అందరి ఫీడ్‌బ్యాంక్‌ను నోటిఫై చేసింది. ఇకపై కీలకమైన సమావేశాలకు సునీల్ టీమ్ హాజరుకానుంది. నాయకుల తీరుపై రాహుల్‌కు నివేదిక ఇచ్చే పనిలో సునీల్ టీమ్ వుంది….నాయకుల తీరుపై రాహుల్‌కు నివేదిక ఇచ్చే పనిలో సునీల్ టీమ్ వుంది. ఇకపోతే.. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ల సమావేశం వాడివేడిగా జరిగింది. ఈ సందర్భంగా నేతలకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ వార్నింగ్ ఇచ్చారు. టైం సెన్స్ లేకపోతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 11 గంటలకు మీటింగ్ అయితే 12.30 గంటలకి రావడం ఏంటని ఠాగూర్ ప్రశ్నించారు. వరుసగా 3 సమావేశాలకు రాకపోతే నోటీసులు ఇస్తానని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిష్టానం అనుమతితో పదవుల నుంచి కూడా తొలగిస్తానని ఠాగూర్ వార్నింగ్ ఇచ్చారు.

ప్రస్తుతం ఐక్యతారాగం వినిపిస్తున్న కాంగ్రెస్లో రానురాను ఎలా ఉండబోతుందో సీనియర్లు అందరూ కలిసి ఒకే తాటిపై ఉంటారా లేదా అనే అంశంపై కూడా కాంగ్రెస్ కేడర్లో అయోమయం నెల ఉంది టిఆర్ఎస్ పార్టీపై పోటీ చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు… కానీ మీరు అందరినీ సమన్వయం చేయడం అంటే తలకు మించిన అని అంటున్నారు సీనియర్లు…. వేచి చూడాల్సిందే తెలంగాణలో కాంగ్రెస్ పాత రోజులు మళ్ళీ తిరిగి వస్తాయా ఇదే కుమ్ములాట ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది…