అభ్యర్థుల ఎంపిక విషయంలో గాంధీ భవన్ లొ లొల్లి..!

అభ్యర్థుల ఎంపిక విషయంలో గాంధీ భవన్లో నువ్వా నేనా అన్నట్లు వ్యవహరించిన ఉత్తమ్ – రేవంత్ రెడ్డి..!

అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ఎన్నికల గురించి గాంధీ భవన్లో ఈరోజు పీఈసీ తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమకుమార్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు…

రెండు టికెట్ల విషయంలో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగినట్లు ప్రచారం. ఒకే కుటుంబానికి రెండు టికెట్ల అంశాన్ని హైకమాండ్ చూసుకుంటుందని రేవంత్ చెప్పగా పీసీసీ చీఫ్‌గా రేవంత్ అధిష్టానంకు చెప్పాలన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుబట్టినట్లుగా కొందరు నాయకులు నుండి అందుతున్న సమాచారం…

నాకు చెప్పడానికి నువ్వెవరు అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన రేవంత్ రెడ్డి.. పిసిసి అయినప్పుడు ఆ బాధ్యతలు నీపైనే ఉంటాయని అనేసమయంలో సమావేశం నుంచి వెళ్లిపోయిన రేవంత్ రెడ్డి..

మరో వైపు మహిళలకు ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పాలంటూ నిలదీసిన రేణుకా చౌదరి.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవసరమైతే సీనియర్లు బీసీలకు సీట్లు త్యాగం చేయాలంటూ కొన్ని మీడియాలతో మాట్లాడుతున్నట్టుగా సమాచారం..

బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పాలన్న వీ. హనుమంత రావు.. ఏ ప్రాతిపదికన సర్వేలు చేస్తున్నారో చెప్పాలన్న బలరాం నాయక్…

మొత్తానికి ఈ టికెట్ల పంచాయతీతో టికెట్ల కేటాయింపు సమావేశమే లొల్లి లొల్లి గా మారింది అంటూ కాంగ్రెస్ నాయకుల మధ్య కొంత అసహనం వ్యక్తం అవుతున్నట్టు సమాచారం..
ఒకే కుటుంబంలో 2 టికెట్లపై ఉత్తమ్, రేవంత్ మధ్య వాగ్వాదం..

ఈ విషయంపై హై కమాండ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి..