తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ టీపీసీసీ చీఫ్ గా ఉన్నా..రిమోట్ కంట్రోల్ ఇప్పుడు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేతిలో..!!!

తెలంగాణ కాంగ్రెస్ లో సమీకరణాలు మారుతున్నాయి. రేవంత్ టీపీసీసీ చీఫ్ గా ఉన్నా..రిమోట్ కంట్రోల్ ఇప్పుడు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేతికి వెళ్లంది. రాష్ట్ర పార్టీలో చేరికలు మొదలు కీలక నిర్ణయాల్లో డీకే ఆమోదంతో నే అమలు అవుతున్నాయి. కర్ణాటకలో పార్టీని గెలిపించిన డీకే శివకుమార్ పైన పార్టీ హైకమాండ్ కు మంచి నమ్మకం ఉంది. తెలంగాణ ఎన్నికల బాధ్యతలను డీకేకి అప్పగించాలని నిర్ణయించారు. డీకే ఇక తెలంగాణలో మకాం వేయనున్నారు. ఆయన నిర్ణయాలే కీలకం కానున్నాయి.

తెలంగాణ పై ఫోకస్: కాంగ్రెస్ నాయకత్వం ఈ సారి తెలంగాణ మీద ప్రత్యేకంగా శ్రద్ద పెడుతోంది. ప్రియాంక గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మాణిక్కం ఠాకూర్ తరువాత థాక్రేకు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించిన తరువాత రాష్ట్రంలోని ప్రతీ రాజకీయ పరిణామం గురించి పార్టీ ఆరా తీస్తోంది. పార్టీలో చేరికలను నేరుగా హూకమాండ్ ముఖ్య నేతల దూతలు పర్యవేక్షిస్తున్నారు. కావాల్సిన నమ్మకం కలిగిస్తున్నారు. రేవంత్ కు సీనియర్ల సహాయ నిరాకరణ.. పార్టీలో అనైక్యత కారణంగా ఇప్పుడు కర్ణాటకలో పార్టీని గెలిపించిన డీకే శివకుమార్ కు పార్టీ తెలంగాణ బాధ్యతలను అప్పగించింది. పార్టీలో ఇప్పుడు చేరికల పైన డీకే శివకుమార్ పర్యవేక్షిస్తున్నారు. డీకే శివకుమార్ త్వరలోనే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పార్టీ సమావేశాలు ఏర్పాటు చేయన్నట్లు తెలుస్తోంది.డీకేతో చేరిక నేతల చర్చలు: ఇప్పుడు పార్టీలో చేరే నేతలను తీసుకొని రేవంత్ బెంగళూరు వెళ్లారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరటం దాదాపు ఖాయమైంది. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన కూచుకుంట్ల దామోదర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దమయ్యారు. ఈ ముగ్గురు నేతలతో కలిసి బెంగళూరులో డీకే శివకుమార్ తో సమావేశమయ్యారు. ఈ ముగ్గురికి పార్టీలో కల్పించే ప్రాధాన్యత పైన డీకే శివకుమార్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. డీకే తో చర్చల తరువాత రేపు ఈ ముగ్గురు నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించేందుకు సిద్దమయ్యారని సమాచారం. ఈ నెల 18 లేదా 19 తేదీల్లో ప్రియాక గాంధీ నల్గొండ సభలో పాల్గొననున్నారు. ప్రియాకం సమక్షంలో వీరు కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. శివకుమార్ కొద్ది రోజుల క్రితం వీరితో మాట్లాడిన తరువాతనే కాంగ్రెస్ నేతల తో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
ప్రియాంక..డీకే కీ రోల్: తెలంగాణ లో కాంగ్రెస్ – షర్మిల పార్టీ మధ్య పొత్తు ప్రతిపాదన పైన డీకే శివకుమార్ చేసినట్లుగా ప్రచారం ఉంది. దీని పైన షర్మిల నిర్ణయం ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది. పార్టీలో చేరే నేతలు కలిసిని సమయంలోనూ డీకే శివకుమార్ తన లక్ష్యాలను స్పష్టం చేసారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి అధికారం కట్టబెట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారని, అయితే కేసీఆర్‌ అక్రమాలు, ప్రజావ్యతిరేక విధానాలను ప్రణాళికాబద్ధంగా ప్రజల్లోకి తీసుకువెళదామని ప్రతిపాదించారు. అధికార పార్టీ నుంచి కొందరు నేతలు కాంగ్రెస్ లోకి వస్తారంటూ డీకే శివకుమార్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీంతో, రేవంత్ తాను తీసుకున్న నిర్ణయాలను డీకే తో చర్చించిన తరువాతనే అమలు చేస్తున్నారని చెబుతున్నారు. అటు ప్రియాంక గాంధీ..ఇటు డీకే శివకుమార్ పూర్తిగా తెలంగాణ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. దీంతో, రానున్న రోజుల్లో పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.