తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రం స్పందన…!!

తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది. పారాబాయిల్డ్ రైస్‌ను కొనలేమని తేల్చిచెప్పింది. 2021-22 రబీ సీజన్‌కు ధాన్యం సేకరణ ప్రతిపాదనలు తెలంగాణ ప్రభుత్వం ఇంకా పంపలేదని కేంద్రం పేర్కొంది. ముడి బియ్యం సేకరణ ప్రతిపాదనలు కోసం ఎదురుచూస్తున్నామని వివరించింది. పారా బాయిల్డ్ రైస్‌ను మాత్రం సేకరించలేమని తెలిపింది. ఎఫ్‌సీఐకి ముడి బియ్యం మాత్రమే ఇస్తామని.. పారా బాయిల్డ్ రైస్ ఇవ్వమని.. భవిష్యత్తులో పారాబాయిల్డ్ రైస్ ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే ఎఫ్ఐసీ దగ్గర మూడేళ్లకు సరిపడా పారాబాయిల్డ్ రైస్ నిల్వలు ఉన్నాయని పేర్కొంది. గత ఐదేళ్లలో తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ పెంచామని స్పష్టం చేసింది.