ఢిల్లీలో తెలంగాణ హీట్..కిషన్ రెడ్డితో రాష్ట్ర బీజేపీ నేతల భేటీ..

R9TELUGUNEWS COM.
షాద్ నగర్, సిటీటైమ్స్: ఢిల్లీలో తెలంగాణ రాజకీయం కాకరేపుతోంది. కత్తులు దూసుకుంటున్న టీఆర్ఎస్ మంత్రులు, రాష్ట్ర బీజేపీ నేతలు దేశ రాజధానిలో మకాం వేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో తాడే పేడో తేల్చుకునేందుకు మంత్రులు సిద్దమయ్యారు. కేంద్ర మంత్రులతో భేటీ కోసం పడిగాపులు పడుతున్నారు. అటు అధికార టీఆర్ఎస్ ఎలా ఎదుర్కొవాలన్న దానిపై తెలంగాణ బీజేపీ నేతలు కమలం పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మకాం వేయగా ఆయనను తెలంగాణ రాష్ట్రం నుండి పలువురు బీజేపీ కీలక నేతలు భేటీ అయ్యారు. బుధవారం ఢిల్లీలో బీజేపీ కీలక నేతలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అరవింద్, షాద్ నగర్ బీజేపీ నేత శ్రీవర్ధన్ రెడ్డి తదితరులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. అమిత్ షాతో కూడా నిన్న కమల నాధుల కీల‌క భేటీ ముగిసింది.బీజేపీ అధిష్టానం పిలుపుతో తెలంగాణ రాష్ట్ర బీజేపీ కీలక నేతలంతా ఢిల్లీకి చేరుకున్నారు. వారంతా కేంద్ర హోం శాఖ మంత్రి, బీజీపీ అగ్రనేత అమిత్ షాతో మంగళవారం మే సమావేశం అయ్యారు. తాజాగా రాష్ట్ర నేతలు మరోసారి బుధవారం ఢిల్లీలో మకాం వేశారు. వారిలో తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ , రాష్ట్ర అధ్యఓడు బండి సంజయ్ , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు , సీనియర్ నేతలు విజయశాంతి, డికే అరుణతో పాటు ఇటీవల పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్న, విఠల్, శ్రీవర్ధన్ రెడ్డి లాంటివారు ఈ భేటీలో పాల్గొన్నారు. అటు కేసీఆర్ ప్రభుత్వ పాలనపై పూర్తి వివరాలను అమిత్ షాకు అందించారు. కేసీఆర్ స‌ర్కాన్‌ను ఇరుకున పెట్టేలా వ్యూహలు రచిస్తున్నట్టు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ ఛైర్మన్ ఎన్. శ్రీవర్ధన్ రెడ్డితో సిటీటైమ్స్ ప్రతినిధి మాట్లాడగా పలు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. మరో ఏడాదిలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుందని తెలుస్తోంది. ఈ భేటీలో ప్రధానంగా తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే వ్యూహాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొని బీజేపీని ఎలా విస్తరింపచేయాలన్న దానిపై వారికి అమిత్ షా దిశానిర్దేశం చేసినట్టు తెలిపారు. రైతుల ప్రయోజనాలు, వడ్ల కొనుగోలు, నిరుద్యోగం, ఇంటర్ విద్యార్థుల సమస్యలు, టీఆర్ఎస్ హామీలు వంటి అంశాలపై కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా మరింత దూకుడుతో ముందుకు వెళ్లాలని తెలంగాణ నేతలకు హైకమాండ్ ఇప్పటికే పలు సూచనలు చేసిందని పేర్కొన్నారు. రెండో విడ‌త ప్రజా సంగ్రామ యాత్ర‌పై క్లారిటీ వచ్చే విధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్ష‌డు బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడతపై కూడా ఈస‌మావేశంలో చర్చించినట్టు పేర్కొన్నారు. దక్షిణ తెలంగాణలో రెండో విడత పాదయాత్రను ఈనెల 27 నుంచి ప్రారంభించేందుకు రాష్ట్ర నేతలు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే కేంద్ర పెద్దల నుంచి అనుమతి రావాల్సి ఉందని ఈ నేపథ్యంలో యాత్రపై ఈ భేటీలో స్పష్టత రానుంది.