ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీకి రంగం సిద్దం..!

*తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీకి రంగం సిద్ధమైంది. 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు విడుదల చేయనున్నారు.* వాటిలో స్కూల్‌ అసిస్టెంట్‌ 2629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టులున్నాయి. దరఖాస్తుల గడువు నియమ నిబంధనలను వెల్లడించనున్నారు.

*మే లేదా జూన్‌లో 10 రోజుల పాటు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహించే అవకాశం* ఉంది. కొత్త నోటిఫికేషన్‌కు నిర్ణయించిన ప్రభుత్వం, గతేడాది సెప్టెంబరు 6న 5089 పోస్టులతో జారీ చేసిన డీఎస్సీ (TS DSC 2024) ప్రకటన రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్రంగా మరో కొత్త నోటిఫికేషన్‌ జారీ చేస్తామని అందులో పేర్కొంది. పాత దరఖాస్తులు చెల్లుబాటులో ఉంటాయని, నూతన డీఎస్సీకి వాటిని పరిగణనలోనికి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వెల్లడించారు. *పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని* స్పష్టం చేశారు.