ఇంటర్‌ ఫస్టియర్‌లో 70% సిలబస్‌ నుంచే ఎంసెట్‌ ప్రశ్నలు…ద్వితీయ సంవత్సరానికి పూర్తి సిలబస్‌..

ఇంటర్‌ ఫస్టియర్‌లో 70% సిలబస్‌ నుంచే ఎంసెట్‌ ప్రశ్నలు.

ద్వితీయ సంవత్సరానికి పూర్తి సిలబస్‌*

రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి స్పష్టీకరణ.

రాష్ట్రంలో మే 7 నుంచి జరిగే ఎంసెట్‌లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 70 శాతం సిలబస్‌ నుంచే ప్రశ్నలు ఇస్తారు. సెకండియర్‌లో మాత్రం 100 శాతం సిలబస్‌ నుంచి ప్రశ్నలుంటాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆర్‌.లింబాద్రి వెల్లడించారు. ఎంసెట్‌ రాయబోయే విద్యార్థులు 2021-22లో ఫస్టియర్‌ పరీక్షలు రాశారని, కరోనా కారణంగా అప్పుడు 70 శాతం సిలబస్‌తోనే వార్షిక పరీక్షలు నిర్వహించినందున ఎంసెట్‌లో ప్రథమ సంవత్సరంలో అదే సిలబస్‌ ఉంటుందన్నారు.*