రేపటి నుండి నామినేషన్ల స్వీకరణ….

*తెలంగాణ…*

_🔹అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు రేపు నోటిఫికేషన్‌ వెలువడనుంది._

_నామినేషన్ల స్వీకరణ 3న మొదలై 10 వరకు కొనసాగనుంది._

_ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు._

_13న నామినేషన్ల పరిశీలన, 15 వరకు ఉపసంహరణ, అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు._

_30న ఓటింగ్‌ జరగనుండగా.. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.

నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఉచితంగా అందజేస్తామన్నారు. నామినేషన్లను వేయు అభ్యర్థులు రూ 10వేలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించవలసి ఉంటుందన్నారు. ఎస్సీ ఎస్టీలకు రూ 5000 సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వవలసి ఉంటుందన్నారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు నామినేషన్ పత్రంతో పాటు తప్పనిసరిగా కుల ధ్రువీకరణల పత్రం జతపరచవలసి ఉంటుందన్నారు. పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లకు 48 గంటల ముందు బ్యాంకు ఖాతా తెరవవలసి ఉంటుందని ఆయన తెలిపారు. రాజకీయ పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఫారం-ఏ, ఫారం-బీలను, ఒరిజినల్ పత్రాలను ఈనెల 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా రిటర్నింగ్ అధికారికి సమర్పించాలన్నారు.
నామినేషన్ వేసే అభ్యర్థి తన పత్రంలోని ప్రతి కాలమ్ తప్పనిసరిగా నింపాలన్నారు. నామినేషన్ పత్రంలో ఏ కాలమ్‌ కూడా ఖాళీగా వదిలేయొద్దని, ఆ కాలంలో నింపాల్సింది లేకపోతే లేదని వర్తించదని రాయాలన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన ఫారం- 26, నోటరైజ్డ్ ఆఫీడవిట్ లో అన్ని కాలామ్‌లను నింపాలన్నారు. పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ సమయంలో గుర్తింపు పొందిన పార్టీ వారు అయితే ఒకరు ప్రతిపాదించాల్సి ఉంటుందని, గుర్తింపు లేని పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తే పది మంది ప్రతిపాదించవలసి ఉంటుందని తెలిపారు.
పోటీ చేసే అభ్యర్థులు ఆఫీడవిట్ సమర్పించాలని, అభ్యర్థి రెండు స్టాంప్ సైజ్ ఫోటోలును ఒకటి నామినేషన్ ఫారం పైన, రెండోది ఆఫీడవిట్ పైన అంటించాలన్నారు. అదనముగా నాలుగు లేటెస్ట్ సైజ్ ఫోటోలు10 అందజేయాలన్నా రు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో రికార్డు అవుతుందన్నారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో వివిటి టీం, అకౌంటింగ్ టీం, సి- విజల్, హెల్ప్ డేస్కులను ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్ల వివరాలను వెంటవెంటనే ఎన్ కోర్ అనే ఎన్నికల సంఘం వెబ్ సైట్ లో అప్ డేట్ చేస్తామన్నారు. ఎన్నికల సంఘం నియమ, నిబంధనలను పాటించి నామినేషన్ ప్రక్రియ సజావుగా పూర్తి చేసేందుకు సహకరించాలన్నారు.