ఎంసెట్ పేరులో మార్పు?..

రాష్ట్రంలో కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ ప్రవేశ పరీక్ష పేరును మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

2017 నుంచి ఎంసెట్‌లో మెడికల్ సీట్ల భర్తీని తొలగించి, ఎంబీబీఎస్, ఇతర వైద్య కోర్సులను నీట్ ద్వారా భర్తీ చేస్తోంది. అయినా ఎంసెట్ పేరులో ఎం మెడికల్ అనే పదం అలాగే కొనసాగుతూ వస్తోంది.

ఈ నేపథ్యంలో మెడికల్ పేరు తొలగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి గవర్నమెంట్‌కు ప్రతిపాదనలు పంపింది. ఎంసెట్‌లో ఎం అక్షరాన్ని తీసేసి.. టీఎస్ఈఏ సెట్ లేదా టీఎస్‌ఈఏపీ సెట్‌గా మార్చాలని ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది.

ఎంసెట్ ద్వారానే బీఫార్మసీ సీట్లను భర్తీ చేస్తున్నందున పీ అక్షరాన్ని తాజాగా పోటీ పరీక్ష పేరుకు చేర్చునున్నట్లు తెలిసింది..