తెలంగాణలో నూతన జోనల్‌ విధానాని, 4 వారాల్లో వివరణ ఇవ్వండి: హైకోర్టు ఆదేశం…

ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ..
4 వారాల్లో వివరణ ఇవ్వండి: హైకోర్టు ఆదేశం..

R9TELUGUNEWS.COM: తెలంగాణలో నూతన జోనల్‌ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. 226 మంది ఉపాధ్యాయుల పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం.. ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. రాష్ట్రపతి, కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వ జీవోలు ఉన్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. కేటాయింపుల ప్రక్రియ పూర్తిగా నిలిపేయాలని కోరారు. అయితే దీనిపై హైకోర్టు స్పందిస్తూ ప్రభుత్వ వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. పిటిషనర్లు లేవనెత్తుతున్న అభ్యంతరాలపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.