రేపటి నుండి పరస్పర బదిలీలకు దరఖాస్తుల ఆహ్వానం….

317జీవో విషయంలో తెలంగాణాలో జరిగినంత రచ్చ వేరే అంశంపై జరగలేదనే చెప్పాలి. ఉద్యోగులు రోడ్డెక్కారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుండి పరస్పర బదిలీలకు దరఖాస్తులు ఆహ్వానించాలని నిర్ణయించింది. మార్చి 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. పరస్పర బదిలీల్లో సర్వీస్ కోల్పోకుండా ఉత్తర్వుల్లో సవరణ చేసింది సర్కార్..పరస్పర బదిలీలకు దరఖాస్తులు పెరిగే అవకాశం వుందని భావిస్తున్నారు. అర్హత గల స్పౌజ్ కేసులు అన్ని పరిష్కారం అయ్యాయని అంటున్నారు అధికారులు. పరస్పర బదిలీ లతో 317జీఓ కి కాలం చెలినట్టేనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. కొత్త రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగుల కేటాయింపు కోసం 317 జీఓ జారీ చేశాము… ఉద్యోగుల కేటాయింపు ఒక్క సారి పూర్తి అయితే ఆ జీఓ తన ఉనికిని కోల్పోయినట్టేనని అంటున్నారు సచివాలయ అధికారులు. మరి పరస్పర బదిలీలకు ఎంతమంది దరఖాస్తు చేస్తారో చూడాల్సివుంది…