గవర్నర్ తమళిసై సంచలన వ్యాఖ్యలు…

ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో కీలక బిల్లులను రాజ్ భవన్ తొక్కి పడుతుందన్న ప్రచారాన్ని తప్పుబట్టిన ఆమె.. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటుపై క్లారిఫికేషన్ కావాలని కోరామని తెలిపారు. 8 ఏళ్లుగా చాలా వర్సిటీల్లో వీసీ పోస్టులు ఖాళీ ఉన్నాయన్న ఆమె తనవల్ల నియామకాలు ఆగిపోయినట్టు బోగస్ ప్రచారం చేయడం సరికాదన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు…రాష్ట్రంలో కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. బోర్డు ఏర్పాటయ్యాక న్యాయపరమైన సమస్యలు వస్తే ఎవరు బాధ్యులన్న ఆమె అందుకే ఈ బిల్లు విషయంలో క్లారిటీ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. అంతేకాదు రాష్ర్టంలో అప్రజాస్వామిక పరిస్థితులున్నాయన్న తమిళిసై మోయినాబాద్ కేసునూ ఆపాదించాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. తన ఫోన్ ట్యాప్ అవుతుందన్న అనుమానం వ్యక్తం చేశారు..