తెలంగాణ ప్రభుత్వానికి మరో షాక్..ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల తిరస్కరణ…

MLCs: నామినేటెడ్ కోట ఎమ్మెల్సీల పేర్లను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. గవర్నర్ కోటాలో తెలంగాణ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ(Kurra Satyanarayana)ను సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. గతంలోనూ ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది…

గతేడాది ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను గవర్నర్ తిప్పి పంపిన సంగతి తెలిసిందే. అలానే ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ప్రవేశ పెట్టిన ఆర్టీసీ బిల్లుకు వెంటనే ఆమోదం తెలుపలేదు. అలా ప్రభుత్వానికి గవర్నర్ షాక్ లు ఇస్తూ ఉన్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి మరో షాకిస్తూ గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం పంపిన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించారు.
అయితే ఆర్టికల్ 171(5) ప్రకారం అభ్యర్థులకు అర్హత లేదని గవర్నర్ కార్యాలయం తెలిపింది. ఈ ఇద్దరిని ఎంపిక చేయడానికి కావాల్సిన సమచారం లేదని గవర్నర్ అభిప్రాయ పడ్డారు. ఈ మేరకు ఈ ఇద్దరి అభ్యర్థిత్వాలను తిరస్కరిస్తున్నట్టుగా తమిళిసై సౌందర్య రాజన్ వివరించారు. ..