బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ఆపాలని ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ …!!!

*బండి సంజయ్ పాదయాత్ర ఆపాలని హైకోర్టులో ప్రభుత్వం అప్పీల్*

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ఆపాలని ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేసింది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రపై నిన్న విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి.. పాదయాత్ర ఆపాలని పోలీసులిచ్చిన నోటీసును సస్పెండ్ చేస్తూ.. బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని సీజే ధర్మాసనాన్ని ప్రభుత్వం కోరింది. పాదయాత్ర కొనసాగితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ పిటిషన్‌పై శుక్రవారం మధ్యాహ్నం 1.15 గంటలకు విచారణకు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం అంగీకరించింది..