తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…హైకోర్టులో లంచ్‌ మోషన్ పిటిషన్ను సర్కార్ ఉపసంహరణ…!!!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టులో లంచ్‌ మోషన్ పిటిషన్ను సర్కార్ ఉపసంహరించుకుంది. హైకోర్టులో బడ్జెట్‌పై దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. బడ్జెట్‌లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం తరపు లాయర్ హైకోర్టుకు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టే తేదీలో మార్పు జరిగింది. ఫిబ్రవరి 3న గవర్నర్‌ ప్రసంగం ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఫిబ్రవరి 6న బడ్జెట్‌ ప్రవేశపెట్టే ఛాన్స్‌ ఉన్నట్టు సమాచారం.