తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు

*🔹తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు.*

తెలంగాణ ముఖ్యాంశాలు వార్తలు
ముగిసిన తెలంగాణ క్యాబినెట్ భేటీ… పలు కీలక నిర్ణయాలకు ఆమోదం..
తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకున్నది. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే తొలి విడుతలో పలు నియోజకవర్గాల్లోని లబ్ధిదారులకు యూనిట్లు అందజేయగా.. త్వరలో రెండో విడత ప్రక్రియను చేపట్టనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు..

సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ క్యాబినెట్ భేటీ ముగిసింది. ఈ భేటీ లో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భేటీ అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… రాష్ట్రంలో 1.30 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇవ్వనున్నామని తెలిపారు. ఇప్పటికే తొలి విడత అమలు చేశామని, త్వరలోనే రెండు విడత చేపడతామని చెప్పుకొచ్చారు. గృహలక్ష్మి పథకం ద్వారా 4 లక్షల మంది పేదలకు ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. నియోజకవర్గానికి 3 వేల చొప్పున ఇళ్లు కేటాయించడం జరుగుతుందని అన్నారు.

ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. ఆయా ఇండ్ల నిర్మాణానికి మరోసారి గడువును పొడిగించింది. కటాప్ డేట్ నెల రోజుల పాటు రిలాక్సేషన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. జీవో 58,59 కింద కొద్ది మంది మిగిలిపోయిన వారు మేం గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయాం, కటాఫ్‌ తేదీ నుంచి ఉపశమనం కల్పించాలని, పేదలకు అందరికీ ఇండ్లపై హక్కులు కల్పించాలని రాష్ట్రవ్యాప్తంగా విజ్ఞప్తులు వచ్చాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్‌ ఎంతో ప్రేమతో.. వారందరికీ చివరిసారిగా అవకాశం ఇవ్వాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు…

1) 1.30లక్షల మందికి దళితబంధు

2)4లక్షల మందికి పోడు భూమి పట్టాలు

3)గృహాలక్ష్మీ పథకం కింద 4లక్షల మందికి రూ.3లక్షలు

4)నియోజకవర్గానికి 3వేల ఇండ్లు

5)రూ.25కోట్లతో శబరిమలలో వసతి గృహాం

6)ఏఫ్రిల్ 14న అంబేద్కర్ విగ్రహాం ఆవిష్కరణ

7)గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న 10బిల్లులపై సుప్రీం కోర్టుకు సర్కారు

8)రేపటి ఢిల్లీలో ధర్నాకు మహిళా మంత్రులు వెళ్లాలని నిర్ణయం