తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కాగా, 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థులను గులాబీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. అయితే.. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉండగానే.. అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించి విపక్షాలకు సవాల్ విసిరారు గులాబీ బాస్.
తెలంగాణ కేబినెట్ విస్తరణ ఆలస్యం కానుంది. బుధవారం ఇద్దరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే గవర్నర్ తమిళిసై సమయం ఇవ్వకపోవడంతో కార్యక్రమం శుక్రవారానికి వాయిదా పడింది. కేబినెట్‌లోకి పట్నం మహేందర్ రెడ్డి, గంప గోవర్దన్‌ను తీసుకుంటున్నట్లు … ప్రమాణ స్వీకారానికి సమయం ఇవ్వాలంటూ సీఎంవో నుంచి రాజ్ భవన్‌కు మంగళవారం నోట్ పంపించారు..ముందుగా బుధవారం ఉదయం 10.30 గంటలకు ప్రమాణ స్వీకారానికి గవర్నర్ టైమ్ ఇచ్చి తర్వాత రద్దు చేశారు. తమిళిసై తీవ్ర పంటి నొప్పితో బాధ పడుతుండటంతో మంత్రుల ప్రమాణ స్వీకారం వాయిదా పడినట్లు తెలుస్తోంది. గవర్నర్ డెంటల్ చెకప్ కోసం హాస్పిటల్‌కు వెళ్లడం, ఇతర కారణాలతో టైమ్ ఇచ్చి క్యాన్సిల్ చేశారని తెలిసింది. అయితే గురువారం మంచి రోజు కాకపోవడంతో శుక్రవారం ప్రమాణ స్వీకారం ఉండబోతున్నట్లు తెలుస్తోంది…
మరోవైపు.. దాదాపు సిట్టింగ్ లకు మరో అవకాశం.. ఇన్ని రోజులుగా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న ఆశావహులను బుజ్జగించేందుకు గాని.. సంతృప్తి చెందని వారు వేరే వారి వద్దకు వెళితే జరిగే నష్టాన్ని పూడ్చుకోవడానికి. పార్టీలు.. కావాల్సినంత సమయం దొరికే అవకాశం ఉంటుంది.