కుటుంబంలో ఉన్న సమస్యల నుంచి తప్పించుకునేందుకు సీఎం కేసీఆర్ గవర్నర్ అంశాన్ని సాకుగా చూపుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.తనను సీఎం చేయాలంటూ కేటీఆర్.. కేసీఆర్పై ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. గవర్నర్తో సఖ్యత లేనప్పుడు.. అది సాధ్యం కాదని కుటుంబ సభ్యులతో సీఎం చెబుతున్నట్లు రేవంత్ పేర్కొన్నారు. ఈ మేరకు గాంధీ భవన్లో మీడియా ప్రతినిధులతో రేవంత్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు ఉన్నాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అధికారికంగా నివేదిక ఇచ్చారు. వెంటనే రాజ్యాంగం కల్పించిన అధికారాలను ఆమె ఉపయోగించుకోవాలి. విద్య, వైద్యం, శాంతి భద్రతల సమస్యలపై సమీక్ష చేసి చర్యలు చేపట్టవచ్చు. రాష్ట్రంలోని సమస్యలను గవర్నర్ గుర్తించారు.. ఫిర్యాదు చేశారు. సెక్షన్ 8 ప్రకారం సమస్యను పరిష్కరించే అధికారం గవర్నర్కు ఉంది. రాష్ట్ర విభజన చట్టం ద్వారా ఏ రాష్ట్ర గవర్నర్కు లేని అధికారాలు తెలంగాణ గవర్నర్కు ఉన్నాయి. ఆమె భాజపా నేతలా మాట్లాడుతున్నారని తెరాస నేతలు విమర్శలు చేస్తున్నారు. గతంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు వాళ్ళు భాజపా అని తెలియదా? గవర్నర్ ఆధ్వర్యంలో రాజ్భవన్లో ఉగాది వేడుకలు నిర్వహించారు. కేవలం సీఎం కేసీఆర్కు కోపం వస్తుందనే హైదరాబాద్లో ఉండి కూడా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వేడుకలకు హాజరు కాలేదని ప్రధాని మోదీ, అమిత్ షాలకు ఫిర్యాదు చేయాల్సింది. అప్పుడే ఇక్కడి కుమ్మక్కు రాజకీయాలు బహిర్గతం అయ్యేవి” అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.