ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ పై నిషేధము ఉత్తర్వులు జారీ చేసిన వైద్య,ఆరోగ్య శాఖ….

ప్రభుత్వ వైద్యులకు ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ వ్యసనంగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. వైద్యో నారాయణ హరి అంటూ.. అలనాటి నుంచి డాక్టర్లను దైవంగా భావి స్తారు. మానవీయతకు మారుపేరుగా డాక్టర్లను అభి వర్ణిస్తారు. అలాంటి వైద్యులు తమ వృత్తి ధర్మాన్ని విస్మరిస్తూ మానవీయ కోణాలను చెరిపేస్తూ కాసుల కోసం కక్కుర్తి పడి వైద్య వృత్తిని పక్కా వ్యాపారంగా మార్చేస్తున్నట్లు ఆరోపణలు లేక పోలేదు.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలందరికీ నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే ఆలోచనతో
ప్రభుత్వ వైద్య అధికారులకు ప్రైవేటు రంగాల్లో పనిచేసే అవకాశానికి స్వస్తి పలికింది.. ఆసుపత్రుల్లో తగిన వైద్య సదుపాయాలు లేక ప్రజలకు నమ్మకం సన్నగిల్లింది. వైద్యం కోసం ప్రజలు భూములు, ఇల్లు, వాకిలి అమ్ముకుని మరింత నిరుపేదలుగా మారేవారు. తెలంగాణ వచ్చిన తర్వాత కొంత మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తోంది.. ప్రజారోగ్యం మీద దృష్టి సారించి మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలందించేందుకు పూనుకున్నారు. తెలంగాణలో ప్రభుత్వ దావఖాన పై ప్రత్యేక దృష్టి సారించింది.. ..