టీఎస్ పీఎస్సీ ద్వారా మరో 2,910 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్.మంత్రి హరీష్ రావు.

2910 కొత్త పోస్టులు..

*గ్రూప్-2* :663, *గ్రూప్-3* :1,373

*విద్యుత్ శాఖలో 11*

పశుసంవర్ధక శాఖలో 309

వ్యవసాయ సహకార శాఖలో 554

ఆర్థికశాఖ అనుమతి.. 11 జీవోలు జారీ

*అతి త్వరలో నోటిఫికేషన్లు..*

★ నిరుద్యోగులకు ప్రభుత్వం పండుగ కానుక

★ ఇప్పటి వరకు ఆర్థికశాఖ అనుమతిచ్చిన
మొత్తం పోస్టులు 52,460

★ 50వేల మైలురాయి దాటడం హర్షణీయం

★ ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు

వినాయక చవితి పర్వదినం వేళ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం పండుగ కానుక అందించింది. టీఎస్ పీఎస్సీ ద్వారా మరో 2,910 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన 11 జీవోలను విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు అనుమతి ఇచ్చిన పోస్టుల సంఖ్య 52,460 కి పెరిగింది. తాజాగా అనుమతించిన 2,910 పోస్టుల్లో గ్రూప్-2 విభాగంలో 663, గ్రూప్-3 విభాగంలో 1,373 పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధిక మంది పోటీ పడే పోస్టులు ఇవే కావటంతో నిరుద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

65 శాతం పోస్టుల భర్తీకి అనుమతి
————————————
రాష్ట్రంలో 91,142 ప్రభుత్వ ఉద్యోగాలు కొత్తగా భర్తీ చేయనున్నట్టు సీఎం కేసీఆర్ మార్చి 9వ తేదీన ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో 80,039 పోస్టులను నేరుగా భర్తీ చేస్తామని, 11,103 పోస్టుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. ఆ వెంటనే మార్చి 23వ తేదీ నుంచే వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతులు ఇవ్వటం మొదలుపెట్టింది. మొదటి విడుతలోనే ఏకంగా 30 వేలకు పైగా పోస్టులకు అనుమతి ఇచ్చింది. వీటిలో గ్రూప్-1 కు సంబంధించి 503 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. సుమారు 17 వేల పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వడంతోపాటు పరీక్షలు కూడా నిర్వహించారు. ఇప్పటివరకు ఏడు విడుతల్లో 52,460 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతులు మంజూరు చేసింది. ప్రకటించిన మొత్తం ఖాళీల్లో ఇవి 65 శాతం.

పోటాపోటీ
———————
రాష్ట్రంలో గ్రూప్-2, గ్రూప్-3 కోసం విపరీతమైన పోటీ ఉన్నది. లక్షల మంది ఉద్యోగార్థులు ఏండ్లుగా ఈ పోస్టుల కోసం అహోరాత్రులు కష్టపడి చదువుతున్నారు. ఎంతో మంది కోచింగ్ తీసుకొంటూ పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు. గ్రూప్-1 పోస్టులకు పోటీ పడలేనివారంతా గ్రూప్-2, గ్రూప్-3 కోసం వందశాతం శక్తియుక్తులను ఉపయోగించి కష్టపడుతుంటారు.

50వేల మైలురాయి దాటడం హర్షణీయం
———————————————
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీలో 50 వేల మైలురాయిని దాటడం హర్షణీయం. మంగళవారం ‘ మరో 2,910 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఇప్పటివరకు 52,460 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. తాజా పోస్టుల్లో గ్రూప్-2, గ్రూప్-3 వంటి కీలక ఉద్యోగాలతో పాటు వ్యవసాయం, పశుసంవర్ధక శాఖల ఖాళీలు కూడా ఉన్నాయి. మిగతా నోటి ఫికేషన్లు త్వరలో విడుదల చేస్తాం. ఉద్యోగార్థులకు శుభాభినందనలు తెలిపారు.ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు..