తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 2 నెలల పీఆర్సీ బకాయిలు చెల్లించనున్నారు…

R9TELUGUNEWS.COM: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 2 నెలల పీఆర్సీ బకాయిలు చెల్లించనున్నారు. 2021 ఏప్రిల్‌, మే నెలల బకాయిలకు సంబంధించి ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2022 మే నుంచి 18 వాయిదాల్లో పీఆర్సీ బకాయిలు చెల్లించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అన్ని ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, సహకార సంస్థల ఉద్యోగులకూ పీఆర్సీ బకాయిలు చెల్లిస్తామని ఆర్థికశాఖ తెలిపింది. మరణించిన ఉద్యోగుల బకాయిలను వారి కుటుంబాలకు ఒకేసారి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది…