తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఐదు రోజులు మాత్రమే..

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. అలాగే తిరిగి జనవరి 18వ తేదీన స్కూల్స్, కాలేజీలు తిరిగి పున: ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే పండుగలు రెండో శనివారం, ఆదివారం రావడంతో గతం మాదిరిగా కాకుండా ఈసారి సంక్రాంతి సెలవులు తగ్గాయని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్నాయి. కానీ ఈ సెలవుల విషయంలో ఇంకా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే సంక్రాంతికి ప్రయాణీకుల రద్దీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సిటీ నుంచి సొంతూళ్ళకు వెళ్లేవారు చాలామంది ఉంటారు. ఇప్పటికే రైళ్లు, బస్సుల్లో రిజర్వేషన్లు ఫుల్ అయిపోయాయి. ఈ క్రమంలోనే టీఎస్ఆర్టీసీ, దక్షిణ మధ్య రైల్వే పలు స్పెషల్ బస్సులు, ట్రైన్లను కేటాయించింది.