ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులకు తెలంగాణ సెక్రెటేరియట్‌లలో ప్రత్యేక హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు….

ఉక్రెయిన్‌లో దాదాపు 20 వేల మంది భారతీయులు ఉన్నారని తేల్చిన కేంద్రం.. ఇప్పటికే 4 వేల మంది వరకు భారత్‌కు తిరిగి వచ్చినట్టు ప్రకటించింది.. అంటే.. ఇంకా దాదాపు 16 వేల మంది ఉక్రెయిన్‌లోనే ఉన్నారు.. ఇక, తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా వందల సంఖ్యలో ఉక్రెయిన్‌లో ఉండడం ఆందోళన కలిగించే అంశం.. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులకు తగు సహాయం అందించేందుకు న్యూ ఢిల్లీతోపాటు తెలంగాణ సెక్రెటేరియట్‌లలో ప్రత్యేక హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్ వెల్లడించారు..