వదంతులు నమ్మవద్దు, అసత్య ప్రచారాలు చేసిన వారిపై చర్యలు. తెలంగాణా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉన్నది..డీహెచ్‌ శ్రీనివాసరావు

R9TELUGUNEWS.COM: తెలంగాణలో ప్రస్తుతం ఒమిక్రాన్‌ బాధితులు ఇద్దరు మాత్రమే ఉన్నారని, ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని డీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. వదంతులు నమ్మొద్దని, అసత్య ప్రచారాలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 77 దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోన్న ఈ ఒమిక్రాన్‌ వేరియంట్‌పై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉందని చెప్పారు. ఒమిక్రాన్‌ లక్షణాలు స్వల్పమే అయినా..వేగంగా విస్తరిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. పండుగలు, శుభకార్యాలు కొంత ఆందోళన కలిగిస్తుంది.. పండుగల వేళ కొవిడ్‌ జాగ్రత్తలను ఎట్టిపరిస్థితుల్లో మరవద్దని హెచ్చరించారు…. అలసత్వం వహిస్తే ఇబ్బందులు తప్పవని తెలిపారు..