తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భ‌ర్తీని చేయాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. సుమారుగా 55వేలు ఉద్యోగాలు..

R9TELUGUNEWS.com..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భ‌ర్తీని చేయాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా 6 నెల‌ల్లో ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయాల‌ని కూడా భావిస్తుంది. కాగ రాష్ట్రం లో మొత్తం అన్ని శాఖ‌ల‌లో 86 వేల ఉద్యోగాలు ఖాళీ గా ఉన్నాయ‌ని తెలుస్తుంది. అయితే అందులో కాంట్రాక్ట్, ఓట్ సోర్సింగ్ ఉద్యోగాలు మిన‌హా మిగితా 55 వేల ఉద్యోగాలను భ‌ర్తీ చేయాల‌ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది…ఈ 55 వేల ఉద్యోగాల‌ను వ‌రుస నోటిఫికేష‌న్ ల‌ను విడుద‌ల చేస్తూ.. ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయాల‌ని నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా భ‌ర్తీ ప్రక్రియను కూడా ఆరు నెల్లో పూర్తి చేయడానికి కసరత్తు చేస్తుంది. కాగ తెలంగాణ రాష్ట్రంలో హోం శాఖ‌లో 21,507 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అలాగే రాష్ట్ర విద్యా శాఖ‌లో 22 వేల‌కు పైగా, వైద్య శాఖ‌లో 10,048, బీసీ సంక్షేమ శాఖ లో 3,538 ఖాళీలు ఉన్నట్టు సమాచారం. ఈ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌డానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మరోవైపు ఉద్యోగాల భర్తీ పై ఉన్న అసంతృప్తిని ఈ నోటిఫికేషన్‌ ద్వారా పూరించాలని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తోంది