పాలనా సంస్కరణల్లో భాగంగా ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ దిశగా ముఖ్యమంత్రి కెసిఅర్ ఇప్పటికే నూతన జిల్లాలను, రెవిన్యూ డివిజన్లను, మండలాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
కాగా ప్రజా ఆకాంక్షలను, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి మరికొన్ని మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. ఈనేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల్లో నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో కొత్తగా 13 మండలాలు ఏర్పాటు అయ్యాయి. ప్రజల ఆకాంక్ష, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి, పరిపాలనా సంస్కరణల్లో భాగంగా మరికొన్ని మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు పలు జిల్లాల్లో కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు కొత్త మండలాలకు సంబంధించిన ఉత్తర్వులను ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపారు._
*_కొత్త మండలాలు ఇవే.._*
1. గట్టుప్పల్(నల్లగొండ)
2. కౌకుంట(మహబూబ్నగర్)
3. ఆలూర్(నిజామాబాద్)
4. సాలూర(నిజామాబాద్)
5. డొంకేశ్వర్(నిజామాబాద్)
6. సీరోల్(మహబూబాబాద్)
7. నిజాంపేట్(సంగారెడ్డి)
8. డోంగ్రి(కామారెడ్డి)
9. ఎండపల్లి(జగిత్యాల)
10. భీమారం(జగిత్యాల)
11. గుండుమల్(నారాయణపేట్)
12. కొత్తపల్లె(నారాయణపేట్)
13. దుడ్యాల్(వికారాబాద్).
పైన పేర్కొన్న నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు…