తెలంగాణలో మందుబాబులకు శుభవార్త…. న్యూ ఇయర్ వేడుకలకై 12గంటల వరకు నైట్ మద్యం షాపులు తెరిచే ఉంటాయి..!!..

తెలంగాణలో మందుబాబులకు శుభవార్త….
తెల్లవార్లు తాగడానికి సరికొత్త అనుమతి…
కిక్కు లో తాగిన మత్తులో ఎగరావచ్చు.. మిగతా రాష్ట్రాల్లో కరోనా భయంతో ముందస్తు మెడికల్ అని రద్దు చేయగా.. తెలంగాణ రాష్ట్రంలో ఈ నిర్ణయంతో ఒక్కసారిగా మిగతా రాష్ట్రాల్లో వాళ్ళు అవాక్కయ్యారు..!!!… తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా కట్టడి లో ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా అధికార వర్గాల సమాచారం..

R9TELUGUNEWS.COM.: తెలంగాణలో మందు బాబులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది…

కొత్త ఏడాది సందర్భంగా మద్యం విక్రయ వేళలు పొడిగించింది…

డిసెంబరు 31న అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది…

31వ తేదీ రాత్రి ఒంటి గంట వరకు ఈవెంట్ల నిర్వహణకు ప్రత్యేక అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు…

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఈవెంట్ల నిర్వహణకు ఎక్సైజ్‌శాఖ తాత్కాలిక లైసెన్స్‌లు జారీ చేయనుంది…

అయితే,ఈవెంట్లలో పాల్గొనేవారి సంఖ్యను బట్టి లైసెన్స్‌ఫీజు రూ.50వేల నుంచి 2.5లక్షలుగా ఎక్సైజ్‌శాఖ నిర్ణయించింది…