మల్లు స్వరాజ్యం మృతిపట్ల ప్రముఖుల సంతాపం.

మల్లు స్వరాజ్యం ఆకస్మిక మరణం పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మల్లు స్వరాజ్యం మరణంతో ఆసుపత్రికి చేరుకున్నారు సీపీఎం నేత, మాజీ ఎంపీ మధు. ఆమె మరణానికి తీవ్ర సంతాపం తెలిపారు. స్వరాజ్యం మరణం తీరని లోటు. భూస్వామ్యక కుటుంబంలో పుట్టిన పోరాట యోధురాలుగానే ఆమె నడిచింది. ఆమె జీవితం ప్రజల కోసం అర్పించింది అన్నారు మధు. మల్లు స్వరాజ్యం ఆకస్మిక మృతికి సంతాపం తెలిపారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి…తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, పీడిత ప్రజల పక్షపాతి, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం మరణం పట్ల ముఖ్యమంత్రి కె.కెసిఅర్, తీవ్ర సంతాపం తెలిపారు. నాటి రైతాంగ పోరాటానికి కేంద్రంగా నిలిచిన తుంగతుర్తి గడ్డ అందించిన చైతన్యంతో ఎదిగిన మహిళా యోధురాలు మల్లు స్వరాజ్యం అని సీఎం అన్నారు. తన జీవితాంతం ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసిన మల్లు స్వరాజ్యం జీవన గమనం గమ్యం రేపటి తరాలకు స్ఫూర్తి దాయకం అని సీఎం తెలిపారు. మల్లు స్వరాజ్యం వంటి మహిళా నేతను కోల్పోవడం తెలంగాణకు తీరని లోటని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు…మల్లు స్వరాజ్యం నేడు అనారోగ్యంతో మరణించారన్న వార్త తీవ్రంగా బాధించిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చివరివరకు నమ్మిన సిద్ధాంతం కోసం పని చేసిన వ్యక్తి. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం వారి పక్షాన నిలబడి పోరాడిన వ్యక్తి. శ్రీమతి మల్లు స్వరాజ్యం మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు అని సంతాపం తెలిపారు కిషన్ రెడ్డి. మల్లు స్వరాజ్యం మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నా అని తెలిపేరు…..

స్వరాజ్యం గారు మరణం తెలంగాణ కు తీరని లోటు….టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. ఆమెను మాలాంటి వారు ఎందరో స్ఫూర్తిగా తీసుకున్నాం….

మల్లు స్వరాజ్యం భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిదాయకం …ఆమె జీవితం భావి తరాలకు స్ఫూర్తిదాయకమని, మల్లు స్వరాజ్యం ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. తన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి హరీశ్‌రావు…

రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి చాలా బాధాకరమని, ప్రజల కోసం అలుపెరగకుండా నిబద్ధతతో పనిచేసిన నాయకురాలిగా,రెండు పర్యాయాలు తుంగతుర్తి ఎమ్మెల్యేగా సేవలందించిన ధీరవనిత మల్లు స్వరాజ్యమని ఈ సందర్భంగా ఆమె సేవలు గుర్తు చేసుకున్నారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్‌రావు సంతాపం తెలిపారు…

మహిళా లోకానికి ఆమె ఒక ఆదర్శం…తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, పీడిత ప్రజల పక్షపాతి, శాసనసభ్యురాలిగా సేవలందించిన మల్లు స్వరాజ్యం మృతి బాధాకరమని అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి..