తెలంగాణ మెడికల్ కాలేజీల కోసం 313 కొత్త పోస్టులు…

*🔹TS మెడికల్ కాలేజీల కోసం 313 కొత్త పోస్టులు*

_రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏర్పాటు చేస్తున్న 9 మెడికల్ కాలేజీల్లో మరో 313 పోస్టులు మంజూరు._

_క్లినికల్, నాన్ క్లినికల్ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల సృష్టికి అనుమతులు._

*_ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ._.

వైద్య విద్యకు ప్రాధాన్యత ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేస్తున్న 9 మెడికల్ కాలేజీల్లో మరో 313 కొత్త పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్లినికల్, నాన్ క్లినికల్ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అనుమతులిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, జయ శంకర్ భూపాలపల్లి, కొమరంభీం ఆసిఫాబాద్, జనగాం, నిర్మల్ లో కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈ కాలేజీల అనుబంధ ఆసుపత్రుల్లో కూడా ఉద్యోగాల నియామకాలు చేపట్టనుున్నారు.