తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు నాంపల్లి కోర్టు షాక్కిచింది.. మంత్రితోపాటు ఐఏఎస్ అధికారులపై కూడా కేసులు పెట్టాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు..!!

తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు నాంపల్లి కోర్టు షాక్కిచింది…

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అనర్హత పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. శ్రీనివాస్ గౌడ్ నవంబర్ 19, 2018న దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ఆధారంగా విచారణ కొనసాగింది. అఫిడవిట్‌లు, ఆధారాలను కోర్టుకు సమర్పించాలని పిటిషనర్‌ను న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు విచారణకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని మీడియాతో పంచుకోవద్దని పిటిషనర్, ప్రతివాదికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి (ఆగస్టు 7) హైకోర్టు వాయిదా వేసింది. కాగా, గత వారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన ఎన్నిక చెల్లదన్న పిటిషన్‌ను కొట్టివేయాలని కోరుతూ శ్రీనివాస్ గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే మంత్రి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు పత్రాలు సమర్పించారని మహబూబ్‌నగర్ కు చెందిన రాఘవేంద్రరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగే అర్హత శ్రీనివాస్‌గౌడ్‌కు లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ పిటిషన్‌లో ఎలాంటి అర్హత లేదని శ్రీనివాస్‌గౌడ్‌ మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇప్పటికే హైకోర్టులో ఇద్దరి వాదనలు పూర్తయ్యాయి. రాఘవేంద్రరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం అనుమతించింది…

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఎలక్షన్‌ అఫిడవిట్‌ ట్యాంపరింగ్ వివాదంపై తీర్పు ఇచ్చిన కోర్టు… మంత్రిపై ట్యాంపరింగ్‌ కేసు పెట్టాలని ఆదేశించింది. మంత్రితో పాటు కొంతమంది ఐఏఎస్ అధికారులపై కూడా కేసులు పెట్టాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీచేసింది. రాష్ట్ర, కేంద్ర రిట్నరింగ్‌ ఆఫీసర్లపై కూడా కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. అయితే ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్ అవాస్తవమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తనపై తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదులు చేయించారని… దీనివెనుక మాజీ మంత్రి, మాజీ ఎంపీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గతంలో ఆరోపించారు.