మిస్‌ ఇండియా వరల్డ్‌గా తెలంగాణ యువతి మానస.

*మిస్‌ ఇండియా వరల్డ్‌గా తెలంగాణ యువతి మానస*

ముంబయి: తెలంగాణకు చెందిన యువ ఇంజినీరు మానస వారణాసి ముంబయిలో జరిగిన వీఎల్‌సీసీ ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ 2020 పోటీల్లో విజేతగా నిలిచారు. హరియాణా యువతి మానిక శికంద్‌ ఫెమినా మిస్‌ గ్రాండ్‌ ఇండియా 2020గా, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మాన్యసింగ్‌ ఫెమినా మిస్‌ ఇండియా 2020 రన్నరప్‌గా నిలిచారు. జ్యూరీ సభ్యులుగా బాలీవుడ్‌ నటులు నేహా ధూపియా, చిత్రాంగద సింగ్‌, పులకిత్‌ సమ్రాట్‌, ప్రముఖ డిజైనర్‌ ఫల్గుణి వ్యవహరించారు.