అన్ని మతాలకు సరైన న్యాయం సీఎం కేసీఆర్ తోనే సాధ్యం..

.

ఏప్రిల్ 3వ తేదీన ప్రారంభమయ్యే రంజాన్ మాసం
మతసామరస్యానికి తెలంగాణ రాష్ట్రం ప్రతీకంగా నిలుస్తోందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్అలీ, మైనారిటీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ లౌకిర రాష్ట్రమని, ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప లౌకిక వాదిగా పేర్కొన్నారు. ఏప్రిల్ 3వ తేదీన ప్రారంభమయ్యే రంజాన్ మాసం నేపధ్యంలో బుధవారం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ బండా శ్రీనివాస్, మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్, ఎమ్మెల్సీలు సయ్యద్ అమీన్ ఉల్ జాఫ్రీ, సయ్యద్ రియాజ్ ఉల్ హసన్, ఎమ్మెల్యేలు కౌసర్ మొయినుద్దీన్, మౌజంఖాన్, అహ్మద్ బిన్ బలాల, అహ్మద్ పాషా ఖాద్రీ,జాఫర్ హుస్సేన్ మీరాజ్,ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, మాగంటి గోపీనాథ్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్, మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ కార్యదర్శి నదీమ్ అహ్మద్,డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్,పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఐపిఎస్ అధికారి చౌహాన్, శంషాబాద్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.