తెలంగాణలో అడుగుపెట్టిన మంకీపాక్స్‌.!!!

రాష్ట్రంలో మంకీపాక్స్‌ కలకలం సృష్టించింది. తాజాగా కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యక్తిలో మంకీ పాక్స్​ లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. కువైట్‌ నుంచి కామారెడ్డికి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్‌ లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈనెల 6న కువైట్​ నుంచి రాగా.. అతనికి జ్వరం, శరీరంపై దద్దుర్లతో బాధపడుతున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు.అనుమానిత వ్యక్తిని ఈరోజు హైదరాబాద్‌ ఫీవర్‌ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. కాగా.. ఈరోజు దిల్లీలో మరో వ్యక్తికి మంకీపాక్స్‌ సోకినట్లు తేలింది. దీంతో దేశంలో మొత్తం నాలుగు కేసులు నమోదైనట్లయింది. ఇప్పటికే కేరళలో మూడు మంకీ పాక్స్​ కేసులు బయటపడ్డాయి.