రైల్వే బ్రిడ్జికి 90 కోట్లు మంజూరు.. జీవో అందజేసిన సీఎం కేసీఆర్…

వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రజలు ఎదర్కొంటున్న ప్రధాన సమస్య అయిన రైల్వే వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్ర‌భుత్వం చొరవతీసుకుంది. చాలాకాలం ఉన్న ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇక్కడ బ్రిడ్జి నిర్మించనున్నారు. దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వం తరపున 96 కోట్లు నిధులు మంజూరు చేశారు సీఎం కేసీఆర్​. ఈమేర‌కు ఇవ్వాల శ‌నివారం దీనికి సంబంధించిన జీవో కాపీని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కు సీఎం కేసీఆర్ అందజేశారు. రైల్వే వంతెన నిర్మాణానికి నిధులు ఇస్తూ జీవో జారీ చేసినందుకు ఎమ్మెల్యే ఆనంద్ సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు…