తాజాగా తెలంగాణ‌లో మ‌రో 14 ఒమిక్రాన్ కేసులు..

R9TELUGUNEWS.COM.
తెలంగాణ‌లో ఒమిక్రాన్ కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణ‌లో మ‌రో 14 ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం రాష్ట్రంలో న‌మోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి చేరింది. ఎట్ రిస్క్ దేశాల నుంచి వ‌చ్చిన 14 మందికి క‌రోనా నిర్ధార‌ణ జ‌రిగిన‌ట్టు వైద్య ఆరోగ్య‌శాఖ తెలియ‌జేసింది. కేసులు పెరిగిపోతుండ‌టంతో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయింది. ఇప్ప‌టికే మాస్క్‌ను త‌ప్ప‌నిస‌రి చేసిన సంగ‌తి తెలిసిందే. మాస్క్ లేకుంటే భారీ జ‌రిమానాలు విధిస్తున్నారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా అవ‌స‌ర‌మైతే నైట్ క‌ర్ఫ్యూ విధించాల‌ని ఇప్ప‌టికే కేంద్రం రాష్ట్రాల‌కు లేఖ‌లు రాసింది. ఒమిక్రాన్‌తో పాటుగా క‌రోనా కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి.