తెలంగాణలో రోజురోజుకీ పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు..

తెలంగాణలో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ విజృంభిస్తోంది. రోజురోజుకు ఒమిక్రాన్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. తెలంగాణలో తాజాగా మరో 3 ఒమిక్రాన్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో తెలంగాణలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 41కి చేరింది. ఇక గత ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఎట్‌ రిస్క్‌ కంట్రీస్‌ నుంచి 333 మంది శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్‌కు వచ్చారు. వారందరికీ కోవిడ్ టెస్ట్‌లు చేశారు. 8 మందికి పాజిటివ్‌గా తేలింది. ఆ రిపోర్ట్స్‌ను జీనోమ్‌ సీక్వెన్సిం.తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఇరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై ఏడు కోవిడ్ టెస్ట్‌లు చేశారు. కొత్తగా 140 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 6,80,553. ఇక గత 24 గంటల్లో తెలంగాణలో కోవిడ్‌తో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో కోవిడ్‌తో ప్రాణాలు కోల్పొయిన మృతుల సంఖ్య మొత్తం 4,021. కోవిడ్ నుంచి తాజాగా 186 మంది కోలుకున్నారు. 3,499 కోవిడ్ యాక్టివ్‌ కేసులు ఉన్నాయి..