తెలంగాణలో మరో కొత్త పార్టీ!.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన ప్రకటన -కారు, కమలానికి దీటుగా?

తెలంగాణలో మరో కొత్త పార్టీ!

– కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన ప్రకటన -కారు, కమలానికి దీటుగా?

తెలంగాణలో గడిచిన కొంత కాలంగా ఈక్వేషన్లు మారుతుండగా, మరో కొత్త రాజకీయ పార్టీకి అవకాశం ఉందా? ప్రతిపక్ష కాంగ్రెస్ పూర్తిగా చేవచచ్చిన స్థితిలోకి వెళుతుండగా, రాష్ట్ర, కేంద్రాల్లోని అధికార పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీలను నిలువరించడం కొత్త శక్తుల వల్ల అవుతుందా? రాజన్న రాజ్యం పేరుతో రెడ్డి-బహుజన కాన్సెప్ట్ తో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టనుండగా, ప్రాంతీయత విమర్శలు లేని పక్కా లోకల్ పార్టీ పెడితే వర్కౌట్ అవుతుందా? లాంటి ప్రశ్నలెన్నో వ్యక్తమవుతున్నాయి కొండా విశ్వేశర్ రెడ్డి ప్రకటన తర్వాత.

తెలంగాణలో కొత్త పార్టీ?

సమైక్య ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి డిప్యూటీ ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి (ఈయన పేరుతోనే రంగారెడ్డి జిల్లా ఏర్పాటైంది) మనవడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మొన్న ఆదివారం వెల్లడించిన ఆయన, ఆ పని ఎందుకు చేయాల్సి వచ్చిందో, భవిష్యత్ కార్యాచరణ ఏమిటన్నదానిపై అభిమానులకు బుధవారం ఓ లేఖ రాశారు. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టే దిశగానూ ఆలోచనలు చేస్తున్నట్లు ఆ లేఖలో కొండా పేర్కొన్నారు