ప్రధాని తెలంగాణ పర్యటన వాయిదా..

తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 19న హైదరాబాద్‌కు ప్రధాని మోడీ రావాల్సి ఉంది. అయితే.. మోడీ షెడ్యూల్‌లో మార్పుల వల్ల ప్రధాని తెలంగాణ పర్యటన వాయిదా పడినట్టు తెలుస్తోంది…సడెన్‌గా వాయిదా వేసుకోవడానికి గల రీజన్ ఏంటనేది తెలియడం లేదు. కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. మోదీ హైదరాాబాద్ వస్తున్న సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభకు కాషాయ శ్రేణులు ఏర్పాట్లు చేస్తోన్నారు. ఇప్పటికే బీజేపీ నేతలు సభస్థలిని పరిశీలించి పలు సూచనలు చేశారు.