దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ త్వరలో తెలంగాణాలో ఏర్పాటు

లోకోమోటివ్స్ కోసం హైటెక్ ఎలక్ట్రానిక్స్’ను డిజైన్ చేసి తయారు చేసే మేధా సర్వో డ్రైవ్స్ తెలంగాణలోని హైదరాబాద్ సమీపంలోని కొండకల్‌లో రూ.1,000 కోట్ల పెట్టుబడితో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోంది. అయితే, దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ త్వరలో ఏర్పాటు కాబోతుందని మంత్రి కె.టి.రామారావు​ నేడు(ఫిబ్రవరి 6) ట్వీట్ చేశారు. మేధా గ్రూప్‌చే ఏర్పాటు చేసిన ఈ అతిపెద్ద ప్రైవేట్ రైలు కోచ్ ఫ్యాక్టరీ త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.​