వరంగల్‌లో రాజకీయ పరిణామాలు హీట్‌… ఒక్క రోజు గ్యాప్ తో కేటీఆర్, రాహుల్ గాంధీ పర్యటనలు…

తెలంగాణలో ఎలక్షన్స్ మరో సంవత్సరం ఉండగానే రాజకీయం వేడెక్కింది… ఎవరికి వారే నువ్వానేనా అన్నట్టుగా ప్రచారం సాగిస్తూ ఉన్నారు అధికార పక్షంపై కాంగ్రెస్ బిజెపి విరుచుకు పడుతుంది.. అదే సమయంలో ప్రతిపక్షాలకు డి అంటే డి అన్నట్టుగా అధికార పక్షం నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు…వరంగల్‌లో రాజకీయ పరిణామాలు హీట్‌ పెంచుతున్నాయి.. ఇప్పటికే వరంగల్‌లో పలు సార్లు మంత్రి కేటీఆర్‌ పర్యటించారు.. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ పర్యటన ఖరారైన తర్వాత కూడా ఈ మధ్యే వరంగల్‌కు వెళ్లివచ్చారు.. ఇప్పుడు మరోసారి అదే జిల్లాలో టూర్‌కు సిద్ధం అయ్యారు. అది కూడా రాహుల్‌ గాంధీ సభ ముగిసిన మరుసటి రోజే కావడం ఆసక్తికరంగా మారింది. ఈ నెల 6వ తేదీన వరంగల్‌ వస్తున్నారు రాహుల్.. రైతు సంఘర్షణ సభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేస్తుంది.. అయితే, మరుసటి రోజే అంటే ఈ నెల 7న మంత్రి కేటీఅర్ వరంగల్ ప‌ర్యటనకు రానున్నారు.