చంద్రబాబుకు తెదేపాపై ప్రేమ ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలి.మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు…

తెలుగుదేశం పార్టీ చంద్రబాబుది కాదు, ఎన్టీఆర్‌ది...

చంద్రబాబుకు తెదేపాపై ప్రేమ ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు…

చంద్రబాబు, టీడీపీపై (TDP) ఇప్పటికే సెటైర్లు వేసిన పలువురు బీఆర్ఎస్ నేతల జాబితాలోకి తాజాగా తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేరారు. చంద్రబాబుకి నిజంగానే తెలుగుదేశంపై ప్రేమే ఉంటే సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ను (Jr NTR) ఏపీకి ముఖ్యమంత్రిని చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. హన్మకొండలో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. మొన్నటి ఖమ్మం సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. వివిధ పార్టీల్లో చేరిన తెలుగు తమ్ముళ్లు వెనక్కి రావాలని పిలుపునిచ్చారు. ఇదే విషయాన్ని ఎర్రబెల్లి వద్ద ప్రస్తావించినప్పుడు ఆయన పై వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబుది కాదని, ఎన్టీఆర్‌దని అన్నారు.చంద్రబాబు, ఆయన కుమారుడు ఏపీకి సీఎం కావాలని అనుకుంటున్నారని అన్నారు. ప్రజలు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు సీఎంగా దిగిపోయే నాటికి హైటెక్ సిటీ వద్ద మంచినీళ్లకు కూడా దిక్కులేదని అన్నారు.