కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, శాసనసభ్యుడు జగ్గారెడ్డిని బుజ్జగించేందుకు పార్టీ ముఖ్య నేతలు రంగంలోకి…

R9telugunews.com: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, శాసనసభ్యుడు జగ్గారెడ్డిని బుజ్జగించేందుకు పార్టీ ముఖ్య నేతలు రంగంలోకి దిగారు.పార్టీలో కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలతో అసంతృప్తితో ఉన్న ఆయన కాంగ్రెస్‌ను వీడుతానని ప్రకటించి.. వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే.
భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు సొంత నియోజకవర్గంలో కార్యకర్తలతో సమావేశం అవుతున్న నేపథ్యంలో జగ్గారెడ్డితో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గురువారం కాంగ్రెస్‌ శాసనసభాపక్ష కార్యాలయంలో భేటీ అయ్యారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తి ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకుందామని, అన్నారు.. అవసరమైతే అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్దామని వారు ఆయనకు సూచించారు. సమావేశం అనంతరం భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. జగ్గారెడ్డి లేవనెత్తిన అంశాలపై పార్టీ అధిష్ఠానంతో మాట్లాడుతామని తెలిపారు. ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని భావిస్తున్నట్లు చెప్పారు. రాజీనామా విషయంలో వెనక్కి తగ్గారనే అనుకుంటున్నామన్నారు. పార్టీని వీడొద్దని జగ్గారెడ్డికి సూచించినట్లు శ్రీధర్‌బాబు చెప్పారు. జగ్గారెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేయరని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.గతంలో పార్టీ వీడుతానని నేనూ అన్నాను.. వెళ్లానా? నాలాగే జగ్గారెడ్డి కూడా’ అని అన్నారు.