తెలంగాణలో 4వ రోజు ప్రారంభమైన రాహుల్‌ యాత్ర…!

ఎఐసీసీ నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర పేరిట దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో ఈనెల 23న తెలంగాణలోకి రాహుల్‌ గాంధీ పాదయాత్ర ప్రవేశించింది.
అయితే.. దీపావళి విరామం తరువాత మళ్లీ 27వ తేదీ నుంచి రాహుల్‌ గాంధీ పాదయాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే నేడు రాహుల్ గాంధీ భారత్ జోడో ధర్మాపురం జేపీఎన్సీ ఇంజినీరింగ్ కళాశాల నుండి యాత్ర ప్రారంభమైంది. మహబూబ్‌ నగర్ నుంచి జడ్చర్ల జంక్షన్ వరకు పాదయాత్ర సాగనుంది. ఈ రోజు 20.3 కిలో మీటర్ల మేర రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. ఈ రోజు పాలమూరు అధ్యయన వేదిక, మైనారిటీ రిసేర్వేషన్ జేఏసీ, ప్రొఫెసర్‌ సుశి తారు తో చర్చించనున్నారు రాహుల్‌ గాంధీ. 2 గంటలకు విద్యావేత్తలతో భేటీ కానున్నారు.

*ధర్మాపూర్ లో ఉదయం 6 గంటలకు రాహుల్ యాత్ర ప్రారంభం కాగా.. మహబూబ్ నగర్ పట్టణం మీదుగా యాత్ర సాగనుంది. ఏనుకొండ లో 10. 30 గంటలకు విరామం.. అక్కడే ఏర్పాటు చేసిన శిబిరంలో లంచ్ చేయనున్నారు రాహుల్. తిరిగి సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుంది. జడ్చర్ల జంక్షన్ లో రాహుల్ కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. జడ్చర్ల సమీపంలోని గొల్లపల్లి వద్ద రాహుల్ రాత్రి బస చేయనున్నారు రాహుల్‌ గాంధీ. అయితే.. నేడు పాదయాత్ర సినీనటి పూనమ్ కౌర్ రాహుల్ యాత్రలో పాల్గొన్నారు.*