రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్​ జారీ..!!

రాష్ట్ర వాతావరణ శాఖ మరోసారి వడగండ్ల వాన అలర్ట్​ను జారీ చేసింది. గురువారం నుంచి నాలుగు రోజుల పాటు వానలు కురుస్తాయని, రెండు రోజులు (శుక్ర, శనివారాలు) వడగండ్ల ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు బుధవారం ఆరెంజ్​ అలర్ట్​ను జారీ చేసింది. ఆరెంజ్​ అలర్ట్​ ఉన్న రోజుల్లో ఆదిలాబాద్​, కుమ్రంభీం ఆసిఫాబాద్​, నిర్మల్​, మంచిర్యాల, నిజామాబాద్​, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్​, పెద్దపల్లి, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు, వరంగల్​, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్​ జిల్లాల్లో వడగండ్ల వానలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్తాయని పేర్కొంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.