తెలంగాణ జిల్లాల్లో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం..

_హైదరాబాద్‌:;తెలంగాణలో చాలాచోట్ల సోమ మంగళ బుధవారం మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అనేకచోట్ల వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు పడవచ్చని పేర్కొంది. ఉత్తర తమిళనాడు తీరంలోని నైరుతి బంగాళాఖాతంలో సోమవారం ఆవర్తనం ఏర్పడి సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతున్నట్లు తెలిపింది. దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్నాయని వెల్లడించింది. సోమవారం రాష్ట్రంలో అత్యధికంగా ఖమ్మం జిల్లా వేంసూరులో 56 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మేడ్చల్‌ జిల్లా కేశవరంలో 18.3, ఖమ్మం జిల్లా పంగిడిలో 11.5, సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో 11 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది._