తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వానలు .మూడు రోజులు ఏయే జిల్లాలకు వర్షం వచ్చే అవకాశం!!.

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాత కూడా మరో రెండు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని.. ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సోమవారానికి సంబంధించి 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను ప్రకటించింది. మిగతా చోట్ల కూడా అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది.

వచ్చే మూడు రోజులు ఏయే జిల్లాలకు..

సోమవారానికి సంబంధించి.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, ఖమ్మం జిల్లాలు మినహా తెలంగాణ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది.
మంగళవారానికి.. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్ అర్బన్, రూరల్, జనగాం, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని.. మిగతా జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది.
బుధవారానికి సంబంధించి.. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, రూరల్, జనగాం, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. మిగతా 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కావొచ్చని తెలిపింది.